అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇటీవల టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లకు కూడా సారధ్య బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ కు ప్రస్తుతం అన్ని కలిసి వస్తున్నాయి. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా ఘన విజయం దక్కడం గమనార్హం. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ వ్యూహాలపై ప్రస్తుతం మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇప్పటికీ ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా తన కెప్టెన్సీ సత్తా ఏంటో నిరూపించిన రోహిత్ శర్మ ఇప్పుడు టీమిండియా కెప్టెన్గా కూడా తిరుగు లేదు అనే విధంగానే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.


 కొంతకాలం నుంచి స్వదేశం వేదికగా టీమిండియా సిరీస్ లని కూడా కైవసం చేసుకోవడమే కాదు ఏకంగా ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించి క్లీన్స్వీప్ చేసింది అని చెప్పాలి.. ఇక మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతు ఉండగా మరో సారి ముంబై ఇండియన్స్ సారథిగా జట్టును ఎంతో సమర్ధవంతంగా ముందుకు నడిపించి ఆరోసారి ముంబైకి కప్పు అందించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే రోహిత్ శర్మకు అసలైన పరీక్ష పెద్ద జట్లతో ఉంటుందని టి 20 ప్రపంచకప్లో కఠిన సవాల్ ఎదురవుతుందని ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ చెప్పుకోచ్చాడు.


 రాబోయే సీజన్లో ఆస్ట్రేలియాతో ఏకంగా నాలుగు టెస్టుల ను ఆడాల్సి ఉంది భారత జట్టు. అంతేకాకుండా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా లతో కూడా సిరీస్లో ఆడబోతుంది. ఇక ఇవన్ని రోహిత్ శర్మ కెప్టెన్సీ కి సవాల్ విసిరెవె. అంతేకాకుండా ఈ ఏడాది ఆసిస్ వేదికగా టి20 ప్రపంచకప్ కూడా ఉంది. ఇటువంటి సమయంలో తన బాడీ లాంగ్వేజ్ను కొనసాగిస్తాడా.. సహనం కోల్పోతాడా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. అయితే వచ్చే సిరీస్ లు రోహిత్ కు ఒత్తిడిలోకి నెట్టేవే. ఈ క్రమంలోనే రోహిత్ ఒత్తిడిలో జట్టును ఎలా ముందుకు నడిపిస్తారు చూడాలని ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా రోహిత్ శర్మ కూల్ కెప్టెన్సికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు అనే విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: