సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొంత మంది నటీనటులుగా రాణించడమే కాదు సమయం వచ్చినప్పుడు దర్శకుల అవతారం కూడా ఎత్తుతూ ఉంటారు.  మరికొన్నిసార్లు నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మించడం కూడా చేస్తూ ఉంటారు. ఇంకొన్నిసార్లు పాటలు పాడి అందరినీ ఆశ్చర్యపరచటం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వారిని బహుముఖ ప్రజ్ఞాశాలి అని అంటూ వుంటారు. అయితే కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు అటు క్రికెట్ కూడా చాలామంది ఇలాంటి బహుముఖప్రజ్ఞాశాలి లు ఉంటారు అన్నది కొన్ని కొన్ని సార్లు తెరమీదికి వస్తూ ఉంటుంది. మైదానంలోకి దిగి అద్భుతంగా క్రికెట్ ఆడడమే కాదు తమ లో మరిన్ని టాలెంట్ లు దాగి ఉన్నాయని కొన్నిసార్లు క్రికెటర్లు నిరూపిస్తూ ఉంటారు.


 కొంతమంది అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది మ్యాజిక్ ట్రిక్స్ చేసి ఇక సహచరులను ఆటపట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది సరికొత్తగా వారిలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ ఉంటారు. ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు కూడా తనలో దాగివున్న ఒక టాలెంట్ ను బయట పెట్టాడు. ఏకంగా ఒక అద్భుతమైన పాట పాడి అభిమానులను అలరించాడు. కేవలం పాట పాడటం మాత్రమే కాదు పాడుతున్న పాటకు తగ్గట్టుగా గిటార్ కూడా వయించాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్రౌండర్ అబ్దుల్ సమద్ ఇలా సింగర్ అవతారం ఎత్తి అభిమానులందరికీ కూడా సర్ప్రైజ్ ఇచ్చాడు. గిటార్ వాయిస్తూ ఒక పాటను అద్భుతంగా పాడాడూ. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఈ వీడియో కాస్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇక దీనిపై నెటిజన్లు భిన్నంగా  స్పందిస్తున్నారు. క్రికెట్ మాత్రమే కాదు ఇక పాడే టాలెంట్ కూడా నీలో ఉందా అని కొంతమంది కామెంట్ చేస్తుంటే క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత చేసే పని ఇదేనేమో అంటూ మరికొంతమంది సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాశ్మీర్ కు చెందిన అబ్దుల్ సమద్ భారీ సిక్సర్లు కొట్టడం తో పాటు తన స్పిన్ మాయాజాలంతో కీలక సమయంలో వికెట్లు పడగొట్టగలడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl