రోహిత్ శర్మ సక్సెస్ఫుల్ కెప్టెన్సీ కి పెట్టింది పేరు ప్రస్తుతం టీమిండియా లో మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ అంతకుముందే ముంబై ఇండియన్స్ సారథ్య  బాధ్యతలు చేపట్టాడు   అన్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ సారధ్య బాధ్యతలను అందుకున్నప్పటి నుంచి అతని కెప్టెన్సీపై నైపుణ్యం ఏంటో అందరికీ నిరూపించాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో అతి తక్కువ సమయంలోనే ఏకంగా ఐదు సార్లు ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ జట్టు ను ఎంతో అద్భుతంగా ముందుకు నడిపించి తిరుగులేదు అని నిరూపించాడు అయితే ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ గెలవలేదు.


 అయితే కేవలం టైటిల్ గెలిపించడమే కాదు మైదానంలో తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తూ ఎంతో అలవోకగా మ్యాచ్ ని తన వైపు తిప్పుకోవడం లో రోహిత్ శర్మ దిట్ట అని చెప్పాలి. కానీ ఈసారి ఐపీఎల్ సీజన్ లో మాత్రం రోహిత్ వ్యూహాలు ఫలించడం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే  ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కు గడ్డు పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. మొదటి మ్యాచ్లోనే పరాజయం పాలైంది ముంబై ఇండియన్స్. ఇలా మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన సీజన్లో ముంబై ఇండియన్స్ కప్ గెలుస్తుంది. ఈసారి కూడా అలాగే జరుగుతుంది అని అనుకున్నారు అందరు. కానీ ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లలో కూడా ఓటమి చవిచూసింది.


 అదేంటి ఎక్కడో తేడా కొడుతుంది అని అనుకున్నారు.ఇక ఇటీవల జరిగిన మూడో మ్యాచ్లో కూడా కోల్కతా చేతిలో ఓడిపోయి ఇక పాయింట్ల పట్టికలో చిట్ట చివరికి వచ్చేసింది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. అయితే ముంబై ఇండియన్స్ వరుస ఓటమి చవి చూస్తూ  ఉండటం పై ఇటీవలే ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ రాజ్ గురు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   కెప్టెన్సినీ రోహిత్ శర్మ వదిలేయాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. రోహిత్ వరుసగా విఫలమవుతున్నాడు. అందుకే కెప్టెన్సీ వదిలేసి కుమార్ యాదవ్ కు అప్పగించాలి. అప్పుడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు   అవకాశం ఉంటుంది. రోహిత్ చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అందుకే   బెస్ట్ బ్యాటింగ్ రావాలంటే కెప్టెన్సీ వదిలేయడమే బెటర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతను బ్యాటింగ్లో పేలవ ఫామ్ టీమిండియాకు పెద్ద మైనస్ గా మారుతుంది అని చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: