కొత్త ఆటగాళ్లతో కొత్త ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది అనుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 2022 ఐపీఎల్ సీజన్ లో ఓటమి తోనే ప్రారంభించింది.. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ ఓటమి చవి చూసిన తర్వాత మ్యాచ్లో పుంజుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత మ్యాచ్ లో కూడా ఓటమి తప్పలేదు. దీంతో సన్రైజర్స్ ఆట తీరులో మార్పు రాలేదని అభిమానులు నిరాశ చెందారు. ఇలాంటి  సమయంలోనే మూడో మ్యాచ్లో పుంజుకున్న సన్రైజర్స్ ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై విజయం సాధించడం గమనార్హం.


 ఇక ఆ తర్వాత ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మరోసారి విజయం సాధించి సత్తా చాటింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇక వరుసగా రెండు విజయాలతో అభిమానులు అందరినీ కూడా ఆనందంలో ముంచేసింది అనే చెప్పాలి. కెప్టెన్ కేన్ విలియమ్సన్, కీలక బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ, నికోలస్ పూరన్ లాంటి వాళ్ళు ఫామ్ లోకి రావడం జట్టుకు ఎంతగానో ప్లస్ పాయింట్ గా మారిపోయింది. అంతేకాకుండా బౌలింగ్ విభాగం కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తూ ఉండడం గమనార్హం. ఇలా వరుసగా రెండు విజయాలతో ఆనందంలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది.


 ప్రస్తుతం హైదరాబాద్ జట్టులో కీలక ఆల్రౌండర్గా కొనసాగుతున్న యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తదుపరి రెండు మ్యాచ్ లకి దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇవన్నీ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మూడు ఓవర్లు వేసిన వాషింగ్టన్ సుందర్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి స్కోరు బోర్డును కంట్రోల్ చేశాడు. అప్పటికే చేతికి గాయమైన కారణంగా సుందర్ తన బౌలింగ్ కూడా పూర్తి చేయలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కుడి చేతికి అయినా గాయం తీవ్రం అయినందుకు ఇక జట్టుకు దూరం కాబోతున్నాడు. ఈ విషయంపై హెడ్ కోచ్ టామ్ మూడి మాట్లాడుతూ వాషింగ్టన్ సుందర్ కుడి చేతి బొటన వేలికి మొదటి వేలికి చీలిక వచ్చింది. కొన్ని రోజులపాటు గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలని.. కోలుకోవడానికి ఓ వారం రోజులు టైం పట్టొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కీలక ఆటగాళ్లు దొరకడంతో సన్రైజర్స్ కు భారీ షాక్ తగిలింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl