ఏడాది ఐపీఎల్ సీజన్లో 5 విజయాలతో ఆశలు రేకెత్తించిన సన్రైజర్స్ హైదరాబాద్ పని అయిపోయినట్లేనా.. ఇక ఎప్పటి లాగానే ప్లే ఆఫ్ చేరకుండా ఈసారి కూడా నిష్క్రమించినట్లేనా అంటే ప్రస్తుతం వినిపిస్తున్న మాట మాత్రం అవును అని. ఎందుకంటే ఈ ఏడాది ప్రస్థానం మొదలు పెట్టడమే ఓటమితో స్టార్ట్ చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట తీరులో మార్పు రాలేదని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా విజయాలు సాధిస్తూ అందరిలో ఆశలు రేకెత్తించింది.


 ప్రత్యర్థిపై పూర్తిస్థాయిలో ఆదిపత్యాన్ని సాధించి హైదరాబాద్ జట్టు విజయాలు సాధించిన తీరు చూసిన తర్వాత హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడం ఖాయమని.. ఈ ఏడాది రెండో సారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోపోతుంది అని ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు. కానీ ఆ తర్వాత మళ్ళి ఓటమి బాట పట్టింది సన్రైజర్స్ జట్టు. సరే 1,2 మ్యాచ్ లలో ఓడిపోయిన తర్వాత పుంజుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఓటముల లో కూడా హ్యాట్రిక్ కొట్టేసింది.



 ఈ క్రమంలోనే ఇటీవలే కోల్కత నైట్రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి 54 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది సన్రైజర్స్ హైదరాబాద్.  దీంతో ఇక ఈ ఏడాది వరుసగా ఐదు విజయల తర్వాత వరుసగా 5 పరాజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. కోల్కతా జట్టు నిర్ధేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించ లేక 123 పరుగులు చేయగలిగింది సన్రైజర్స్. అభిషేక్ శర్మ మార్కరమ్ మినహా ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు. కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ ఆండ్రూ రస్సెల్ మూడు వికెట్లు సాధించి సత్తా చాటాడు. ఇక ఇప్పుడు సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్లడం ఎంత సంక్లిష్టంగా మారిపోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: