ఏడాది ఐపీఎల్లో ఫైనల్ చేరిన మొదటి జట్టుగా నిలవాలని ఎంతో ఆశ పడిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో చేదు అనుభవమే ఎదురైంది అని తెలుస్తోంది. అయితే రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లు మంచి స్కోరు నమోదు చేసినప్పటికీ ఆ తరువాత చేదనకు కుదిరిన  గుజరాత్ చెలరేగి ఆడటంతో .రాజస్థాన్ జట్టుకు ఓటమి తప్పలేదు అని చెప్పాలి. అయితే ఇక రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు శుభారంభం లభించ లేదనే చెప్పాలి. గత మ్యాచ్ లో చెలరేగిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు పరుగులకే  వికెట్లు కోల్పోయి పెవిలియన్ చేరాడు


 ఇక ఆ తర్వాత ఎంతో నెమ్మదిగా ఆడుతున్నట్లు కనిపించిన పరుగుల వీరుడు జోస్ బట్లర్ ఒక్కసారిగా గేరు మార్చి సిక్సర్లు ఫోర్లు తో విరుచుకుపడ్డాడు. ఏకంగా 89 పరుగులు చేశాడుm ఇక కెప్టెన్ సంజీవ్ సాంసంగ్ కూడా 47 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టులో బిల్డప్ బాబాయ్ గా పేరు సంపాదించుకున్న రియాన్ పరాగ్ మాత్రం ఇటీవల జరిగిన మ్యాచ్లో కూడా కాస్త ఓవరాక్షన్ చేసి చివరికి వికెట్లు చేజార్చుకున్నాడు. రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చాడు రియాన్ పరాగ్. ఈ క్రమంలోనే  సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ పట్ల వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.


 20 ఓవర్లో అశ్విన్ క్రీజు లో ఉండగా యాష్ దయాల్ బంతిని సంధించాడు. అది వైడ్ గా వెళ్ళింది. అశ్విన్ ఆ బంతి ఎలా వెళ్లిందా అని చూస్తుంటే.. మరో ఎండ్ నుంచి రియాన్ పరాగ్ పట్టించుకోకుండా పరుగు కోసం వచ్చాడు. అశ్విన్ మాత్రం రియాన్ పరాగ్ ను గమనించలేదు  దీంతో క్రీజు నుంచి కదలలేదు. దీంతో ఇక అశ్విన్ ను సీరియస్ గా చూస్తూ రన్ ఎందుకు రాలేదు అన్నట్లు సైగ చేసాడు.  అశ్విన్  మాత్రం పరిగెత్తుకొచ్చిన పరాగ్ ను చూసి ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇది చూసి బిల్డప్ బాబాయ్ మరోసారి ఓవరాక్షన్ చేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl