సొంతగడ్డపై అద్భుతంగా రాణించిన పాకిస్థాన్ జట్టు చివరికి వెస్టిండీస్ పై చేయి సాధించింది అని చెప్పాలి. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ పంచింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజాం ఒక వివాదం బారిన పడ్డారు. ఐసీసీ రూల్స్ ని బాబర్ అజాం బ్రేక్ చేయడం గమనార్హం. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఒక చేతికి కీపింగ్ గ్లౌజ్ వేసుకుని కనిపించాడు.
అలాగే ఫీల్డింగ్ కూడా చేసాడు. ఈ క్రమంలోనే లా ఆఫ్ క్రికెట్లోని 28.1 రూల్ ప్రకారం వికెట్ కీపర్ మినహా మైదానం లో ఉన్న మిగతా ప్లేయర్లు ఎవరూ కూడా ఫీల్డింగ్ చేసేటప్పుడు గ్లౌస్ వేసుకునేందుకు వీలు లేదు. ఇక ఒకవేళ అలా వేసుకున్నారు అంటే వాళ్లు నిభందనలు ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ క్రమంలోనే ఇక పాకిస్తాన్ కెప్టెన్ ఇలా గ్లౌజ్ వేసుకుని ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో పెనాల్టీ కింద వెస్టిండీస్ జట్టుకు అదనంగా ఐదు పరుగులు బోనస్ గా ఇచ్చారు మ్యాచ్ రిఫరీ లు. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి