సాధారణంగా అన్ని దేశాల క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగినప్పటికీ వరల్డ్ కప్ కు ఉండే క్రేజే గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి దేశం కూడా అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగుతోంది. వరల్డ్ కప్ లో విజయం సాధించాలని ఎన్నో లక్ష్యాలను పెట్టుకుంటూ ఉంటుంది. అందుకే వరల్డ్ కప్ లోని ప్రతీ మ్యాచ్ కూడా అటు ప్రేక్షకులకు ఎంతో రసవత్తరంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.  ఇకపోతే మరికొన్ని రోజుల్లో ఇలాంటి వరల్డ్ కప్ ఎంటర్టైన్మెంట్ ప్రారంభం కాబోతుంది అనే విషయంతో తెలిసిందే.  ఈ ఏడాది ఆస్ట్రేలియా టి20 వరల్డ్ కప్ జరగబోతుంది.


 ఇక ఈ వరల్డ్ కప్ లో పదునైన వ్యూహాలతో బరిలోకి దిగి ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని ప్రస్తుతం అన్ని దేశాల జట్లు భావిస్తూ ఉన్నాయ్. ఈ క్రమంలోనే అత్యుత్తమ జట్టును వరల్డ్ కప్ లో  బరిలోకి దింపేందుకు ఇప్పటికే పలు ప్రయోగాలు కూడా చేశాయి అని చెప్పాలి. కాగా ఇక ఈ ఏడాది వరల్డ్ కప్ లో ఏ జట్టు బాగా రాణిస్తుంది ఏ జట్టు విశ్వ విజేత గా నిలుస్తూ సత్తా చాటుతోంది అన్నది మాత్రం ఆసక్తికరం గా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఆస్ట్రేలియా వేదిక ఈ ఏడాది అక్టోబర్ -నవంబర్ నెలల్లో జరగబోయే వరల్డ్ కప్ విషయంలో ఇటీవల ఐసీసీ అన్ని జట్లకు సరికొత్త నిబంధనలు పెట్టింది.



 సెప్టెంబర్ 15 వ తేదీ లోపు ఇక అక్టోబర్ - నవంబర్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ కోసం పూర్తి వివరాలను ప్రకటించాలి అంటూ ఐసీసీ రూల్స్ విధించడం గమనార్హం. ఐసీసీ  నిర్దేశించిన గడువులోగా అన్ని జట్లు ప్రపంచ కప్ బరిలోకి దిగే 15 మంది సభ్యుల వివరాలను ప్రకటించాలని.. ఇక పూర్తి వివరాలను సమర్పించాలని అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని జట్లు అప్రమత్తమయ్యాయి. ఇన్నాళ్ళ వరకు ప్రయోగాలు చేస్తూ ఉండి పోయిన జట్లు ఇక ఇప్పుడు తుది జట్టులోకి తీసుకోబోయే ఆటగాళ్లపై దృష్టి పెట్టాయి. ఇక ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయ్. కాగా అక్టోబర్ 16 వ తేదీన టి20 వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc