ఇటీవల టీమిండియాలో అనుకోని పరిస్థితుల మధ్య టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ భారత జట్టుకు కెప్టెన్సీ చేపట్టే అవకాశాన్ని దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే. కానీ సొంత గడ్డపై ఏకంగా టీమిండియా వరుస పరాజయాలు చవి చూసింది. ఆ తర్వాత రెండు మ్యాచ్లలో గెలుపొందింది. ఐదో మ్యాచ్ రద్దు అయింది. దీంతో సిరీస్ 2-2 తో సమమైంది అన్న విషయం తెలిసిందే. ఇలా రిషబ్ పంత్ వరుసగా రెండు మ్యాచ్ లలో టీమ్ ఇండియా ని గెలిపించలేకపోవడం పై మరీ ముఖ్యంగా ఒక ఆటగాడిగా అతనిని ప్రదర్శన పేలవంగా ఉండటం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ అతని జట్టు నుంచి పక్కనపెట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.


 ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ రిషబ్ పంత్ కి మద్దతుగా నిలిచాడు. రిషబ్ పంత్ చేయవలసినది ఏమిటంటే అతనిపై అతను నమ్మకం ఉంచాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇతర ఆటగాళ్లు ప్రభావానికి లోను కాకూడదు అంటూ బ్రాడ్ హాగ్ సూచించాడు. ఇక రిషబ్ పంత్ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే మహేంద్రసింగ్ ధోని కి ఫోన్ చేయాలి లేదా రాహుల్ ద్రావిడ్ తో మాట్లాడాలి వారి నుంచి సలహాలు సూచనలు తీసుకుని వాటిని మ్యాచ్ జరుగుతున్న సమయంలో అమలులో పెట్టాలి.  అతనిపై అతడికి నమ్మకం ఉంటే అతను ఏదైనా సాధించగలడు అనే విషయం అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.


 అయితే ఈ ఏడాది భారత కెప్టెన్గా వ్యవహరించిన ఇతర ఆటగాళ్లు రోహిత్ శర్మ అజేయమైన రికార్డుతో పోల్చడం నిజంగానే అన్యాయం అంటూ  చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు విదేశీ గడ్డపై టీమిండియా జట్టుకు కెప్టెన్సీ వహించలేదు అంటూ గుర్తు చేశాడు. కెప్టెన్సీ విషయంలో భారత జట్టులో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఓటములు ఎదురైనప్పుడు ఈ చర్చ మరింత తీవ్రతరం అవుతుంది అంటూ బ్రాడ్ హాగ్ తెలిపాడు. రోహిత్ శర్మ ఈ ఏడాది 11 మ్యాచ్ లకు నాయకత్వం వహించి అన్నింట్లో జట్టును విజయపథంలో నడిపించాడు. కానీ విదేశీ గడ్డపై రోహిత్ శర్మ జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు అంటు అభిప్రాయం వ్యక్తం చేశాడు బ్రాడ్ హాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: