సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఎవరైనా ఆటగాడు వికెట్ కోల్పోయాడు అంటే చాలు అతడు ఎంతలా నిరాశకు గురి అవుతూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే  కొన్ని కొన్ని సార్లు కోపంతో ఏకంగా బ్యాట్ విసిరేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఆటగాళ్ళు లేదా తనను తాను విమర్శించుకోవడం కూడా చేస్తుంటారు. అయితే కేవలం క్రికెట్ లో మాత్రమే కాదు అన్ని ఆటలలో కూడా ఇలాంటివి సహజం అని చెప్పాలి.


 ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని బరిలోకి దిగుతు ఉంటారు కాబట్టి ఏ చిన్న పొరపాటు జరిగినా తీవ్ర అసహనానికి నిరాశకు గురవుతుంటారు. అయితే మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కోపంలో ఉన్న వ్యక్తి ఎదురుగా ఏది కనిపిస్తే చాలు దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇటీవలే బేస్బాల్ ఆటలో కూడా తాను అవుట్ అయ్యాను అని కోపంతో ఆటగాడు బ్యాట్ ను రెండు ముక్కలు చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎంతో బలమైన బ్యాట్ ను ఏదో చిన్న కట్టే ముక్కలాగ సింపుల్ గా విరిచేశాడు..


దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. న్యూయార్క్ మేట్స్, మియామీ మార్లింగ్స్ మధ్య బేస్ బాల్ మ్యాచ్ జరిగగింది. ఈ మ్యాచ్లో న్యూయార్క్ మెట్స్ 5-3 తేడాతో మియామీ మార్లిన్స్ పై విజయం సాధించడం గమనార్హం.అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో న్యూయార్క్ మెట్స్ స్టార్ పీట్ ఆలోన్సో ప్రవర్తించిన తీరు మ్యాచ్ హైలైట్ గా మారిపోయింది.. ఎనిమిదవ ఇన్నింగ్సులో ఆలోన్సో షాట్ ఆడే ప్రయత్నంలో చివరికి అవుటయ్యాడు. తీవ్ర కోపంతో ఊగిపోయి కట్టె ముక్కను విరిచేసినట్లుగా తన బ్యాట్ ను తొడ భాగంలో పెట్టుకోని సింపుల్ గా ముక్కలు చేసాడు. ఇది చూసి అందరూ అవాక్కయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: