ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా భారత జట్టు ఆడుతున్న రీషెడ్యూల్ మ్యాచ్ లో బుమ్రా చేసిన బ్యాటింగ్ ప్రదర్శన గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఎప్పుడూ తన బౌలింగ్ తో అదరగొట్టే  బుమ్రా మొదటిసారి తన బ్యాటింగ్తో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి ప్రపంచ రికార్డు నెలకొల్పడంపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.  అయితే బ్యాటింగ్  లోనే కాదు అటు బౌలింగ్ లో కూడా జస్ప్రిత్ బూమ్రా   రికార్డు సృష్టించాడు అన్నది తెలుస్తుంది. బౌలింగ్ లో భాగంగా కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు జస్ప్రిత్ బూమ్రా. ఒక రకంగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఏకంగా రెండోరోజు ఆటలో భాగంగా 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్ జట్టు.  ఇందులో బుమ్రా 3 వికెట్లు, మహ్మద్ షమీ, సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టడం తో జస్ప్రిత్ బుమ్రా మరో ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టోర్నమెంట్ 2021-23 సైకిల్ లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు టీమిండియా కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా. ఇప్పటి వరకు మొత్తం నలభై మూడు వికెట్లు పడగొట్టాడు.  10 మ్యాచుల్లో 18 ఇన్నింగ్స్ లు ఆడిన జస్ప్రిత్ బూమ్రా నలభై మూడు వికెట్లు తీసుకోవడం గమనార్హం. అంతే కాదు ఇందులో 79 మెయిడెడ్ ఓవర్లు కూడా వేశాడు.


 ఇక ఇందులో బెస్ట్ 5/24 కావడం గమనార్హం. అయితే ఇక జస్ప్రిత్ బూమ్రా మొదటి స్థానంలో కొనసాగుతుండగా రెండవ స్థానంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఉన్నాడు. మొత్తంగా 10 మ్యాచుల్లో కలిపి 39 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆ తర్వాత స్థానంలో పాకిస్థాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది 37 వికెట్లు, ఆస్ట్రేలియా స్పిన్నర్ లియాన్ 37 వికెట్లతో 3, 4  స్థానాల్లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌతీ 33, రాబిన్ సన్ 32, వెస్టిండీస్ బౌలర్ సీల్స్ 31, భారత బౌలర్ మహ్మద్ షమీ 31, రబడా 30 వికెట్లతో తొలి పది స్థానాల్లో కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఇలా బ్యాటింగ్ లోనే కాదు బౌలింగులో కూడా రికార్డు కొట్టడంతో బుమ్రా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: