ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఇంగ్లాండ్ పై చారిత్రాత్మక విజయం సాధించాలంటే భారత జట్టు టెస్టు మ్యాచ్ లో గెలవాలి లేకపోతే మ్యాచ్ డ్రాగా ముగించాలీ. ఈ రెండు జరగలేదు అంటే చాలు అటు ఇంగ్లాండ్ జట్టుకు మరోసారి చేదు అనుభవం ఎదురవుతుంది. బుమ్రా కెప్టెన్సీ లో బరిలోకి దిగిన టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసిందనే చెప్పాలి. ఇంగ్లాండ్ జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించడంతో టీమిండియాదే విజయం అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు.



 కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఇక ఇప్పుడు మ్యాచ్ మొత్తం అటు ఇంగ్లాండ్ వైపే మారిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప టీమిండియా విజయం సాధించేలా కనిపించడం లేదు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే అటు రిషబ్ పంత్ సాధించిన సెంచరీ గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారిపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో  57 పరుగులతో రాణించాడు రిషబ్ పంత్. అయితే విదేశాల్లో టీమిండియా తరఫున రిషబ్ పంత్ సెంచరీ చేసిన కొన్ని సందర్భాలలో కూడా టీమిండియా గెలిచిన దాఖలాలు లేవు అని చెప్పాలి. ఇక ఇటీవలే పంత్ సెంచరీ చేయడంతో ఈ మ్యాచ్ గెలుస్తుందా ఓడుతున్న అనే అనుమానం మరింత ఎక్కువ అయిపోయింది.


 ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..  2018 ఇండియా టూర్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ టెస్ట్ సిరీస్ ఇదో టెస్ట్ లో పంత్‌ 114 చేస్తే.. టీమిండియా ఓటమి తప్పలేదు. 2019 ఇండియా  ఆస్ట్రేలియా టూర్ లో నాలుగో టెస్ట్‌ లో పంత్‌ 159 నాటౌట్‌ చివరికి మ్యాచ్‌ డ్రా అయ్యింది. 2021 ఇంగ్లండ్‌ టూర్‌ లో నాలుగో టెస్ట్‌ లో పంత్‌ 101 తో సెంచరీ చివరికి 25 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 2022  సౌతాఫ్రికా  టూర్ లో మూడో టెస్ట్‌ లో పంత్‌ 100 నాటౌట్‌- టీమిండియాకు ఓటమి తప్పలేదు. 2022  ఇంగ్లండ్‌ టూర్ ఐదో టెస్ట్‌ లో పంత్‌ 146 సెంచరీ ఏం జరుగుతుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: