మొన్నటివరకు పురుషుల హాకీ జట్టు జట్టు ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఎంతో హోరాహోరీగా తలపడ్డారు. ఈ క్రమంలోనే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ కప్ విజేతగా నిలుస్తుందని భారత్ అభిమానులందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా నిరాశ ఎదురైంది అన్న విషయం తెలిసిందే. మొదట్లో బాగా రాణించినట్లే కనిపించిన పురుషుల హాకీ జట్టు ఆ తర్వాత మాత్రం నిరాశ పరిచింది. చివరికి  ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. అయితే ఇప్పుడు అందరి ఆశలు కూడా మహిళల హాకీ జట్టు మీదే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ప్రస్తుతం హాకీ ప్రపంచ కప్ లో భాగంగా భారత జట్టు వరుస మ్యాచ్ లు ఆడుతుంది.


 ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా మారిపోతుంది అని చెప్పాలి. అయితే హాకీ ప్రపంచ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ అటు ఇంగ్లాండుతో ఆడింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగించింది అన్న విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో చివరికి భారత్ కు విజయం వరించలేదు అని చెప్పాలి. కాగా ఇటీవలే హాకీ ప్రపంచ కప్ లో భాగంగా చైనాతో మ్యాచ్ ఆడింది భారత మహిళ హాకీ జట్టు.  ఇక ఈ మ్యాచ్లో గెలిచి అటు వరల్డ్ కప్ లో  భోని కొడుతుంది అని అందరూ అనుకున్నారు. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది అన్నది తెలుస్తుంది.


 మహిళల ప్రపంచ కప్ లో భాగంగా చైనాతో జరిగిన మ్యాచ్ లు కూడా భారత్ డ్రాగా ముగించింది. మొదట చైనా ప్లేయర్ జియాంగి జిల్ గోల్ కొట్టి చైనా ను ఆదిత్యం  లోకి తీసుకెళ్ళింది. అయితే సెకండాఫ్ వరకు చైనాది ఆధిక్యం కొనసాగింది అని చెప్పాలి. ఇక చివర్లో భారత ప్లేయర్ వందన కటారియా గోల్ చేసి స్కోర్ సమం చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది అని చెప్పాలి. అయితే భారత్ గెలవకపోయినా ఇక ఓటమి నుంచి తప్పించుకుంది అని అటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి.  కాగా ప్రస్తుతం భారత్ పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: