టీమిండియాలో సీనియర్ ఓపెనర్గా బెస్ట్ ఫర్ ఫార్మర్మర్ గా గుర్తింపు సంపాదించుకున్న శిఖర్ ధావన్ కు యువ ఆటగాళ్లు నుంచి టీమిండియాలో పోటీ పెరిగిపోయినా నేపథ్యంలో గత కొంతకాలం నుంచి సరిగ్గా అవకాశాలు దక్కించుకోలేక పోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి టీమిండియాకు దూరంగానే ఉన్నాడు. కానీ ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మరోసారి శిఖర్ ధావన్ కు టీమిండియా జట్టులో అవకాశం దక్కింది. అయితే ఇంగ్లండ్ పర్యటనలో మాత్రం అతను పెద్దగా తన ప్రదర్శన తో ఆకట్టుకోలేక పోయాడు అని చెప్పాలి.


 అయితే అటు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియా కు మాత్రం కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. తన ప్రదర్శన తో కూడా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే శిఖర్ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా జట్టు వరుసగా రెండు వన్డే మ్యాచ్లలో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ ప్రదర్శన పై అందరూ సంతృప్తిగానే ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 శిఖర్ ధావన్ విషయంలో నేను చాలా అయోమయం లో ఉన్నాను. అతనికి టీమిండియాలో చోటు ఎలా దక్కిందో కూడా ఇప్పటికీ అర్థం కావడం లేదు అంటూ అజయ్ జడేజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆరు నెలల ముందు అతని జట్టు నుంచి తీసేసారు. శిఖర్ ధావన్ కంటే కె.ఎల్.రాహుల్ ఓపెనర్ గా బెటర్ అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సడన్గా శిఖర్ధావన్ ని పిలిచి మళ్ళి కెప్టెన్సీ అప్పగించారు. ఇలా ఒకసారి తప్పించి ఒకసారి ఆడించి అతనితో ఎందుకు  ప్రయోగాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ అజయ్ వ్యాఖ్యానించాడు. కేఎల్ రాహుల్ ఎంట్రీ ఇస్తే శిఖర్ ధావన్ కు చోటు దొరకడం కష్టమే అంటూ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: