టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ను గత కొంతకాలం నుంచి దురదృష్టం వెంటాడుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు టీమిండియా వరుసగా విదేశీ పర్యటనలకు వెళ్తూ సిరీస్లు ఆడుతూ బిజీ బిజీగా గడుపుతుంటే అటు కీలక బ్యాట్స్మెన్  అయిన కేఎల్ రాహుల్ మాత్రం వివిధ కారణాలతో జట్టుకు దూరం అవుతూనే వస్తున్నాడు. దక్షిణాఫ్రికా భారత పర్యటనకు వచ్చిన సమయంలో కెప్టెన్సీ అవకాశం అందుకున్నాడు కె.ఎల్.రాహుల్. అయితే ప్రాక్టీస్ సెషన్లో గాయపడటంతో చివరికి దక్షిణాఫ్రికాతో ఆడిన సిరీస్ లకు  దూరం అయ్యాడు.


 అయితే ఇక గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం తో జర్మనీ లో శస్త్ర చికిత్స చేయించు కున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే గాయం కారణం గా అటు ఇంగ్లండ్ పర్యటనకు కూడా దూరమయ్యాడు కేఎల్ రాహుల్. ఈ క్రమం లోనే బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక కేఎల్ రాహుల్ ను అటు వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్లో పరిగణ లోకి తీసుకోలేదు. కనీసం టి20 ఫార్మాట్ లో అయినా కె.ఎల్.రాహుల్ అందుబాటులోకి వస్తాడని  అందరు అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే ఈనెల 21వ తేదీన కరోనా వైరస్ బారిన పడ్డాడు కె.ఎల్.రాహుల్.


 ఈ క్రమం లోనే ప్రస్తుతం ఐసోలేషన్  లో ఉంటూ ఉంటూ వైరస్ నుంచి కోలుకుంటున్నాడు.  అయితే వెస్టిండీస్ టీ20 సిరీస్ నేపథ్యం లో ఇప్పటికే కొంత మంది ఆటగాళ్ళు అటు విండీస్ గడ్డపై అడుగు పెట్టారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సిరీస్కు కూడా కె.ఎల్.రాహుల్ దూరమైనట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు నిరాశ పడుతున్నారు.  అయితే జింబాబ్వేతో ఆగస్టు 18వ తేదీన ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో నే  కేఎల్ రాహుల్  పునరాగమనం సాధ్యమయ్యే అవకాశం ఉంది అన్నది మాత్రం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: