కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత క్రికెట్ కు అవకాశం దక్కింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహిళల జట్లు కామన్వెల్త్ క్రీడల్లో టి20 టోర్నీ ఆడాయి. ఈ టోర్నీలో భాగంగా అటు భారత మహిళల జట్టు భారీ అంచనాలతో బరిలోకి దిగింది. ఇక ఎంతో దూకుడుగా విజయాలు సాధిస్తూ టీమిండియా ముందుకు సాగుతున్న తీరు చూస్తే కామన్వెల్త్ క్రీడల్లో విజయం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఇక ఇలాంటి సమయంలో ఇక ఫైనల్ వరకు ఎంతో అద్భుతమైన ప్రదర్శన తో దూసుకుపోయిన టీమిండియా మరోసారి దిగ్గజ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమ్ ఇండియాను ఫైనల్ మ్యాచ్ లో ఓడించడం ఆస్ట్రేలియాకు అంత సులభమైన విషయం కాదు అని అందరూ అనుకున్నప్పటికీ ఇక ఎప్పటిలాగానే భారత జట్టుపై ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని కొనసాగించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ లో బంగారు పథకానికి అడుగు దూరంలో ఆగిపోయింది.. సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది టీమిండియా. అయితే టీమిండియా ఓడిపోయినప్పటికీ ఇక విజయం కోసం టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా వీరోచితమైన పోరాటం చేసిన తీరు ప్రేక్షకుల మనసును గెలిచింది అని చెప్పాలి.


 ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో పటిష్టమైన ఆస్ట్రేలియా పై 9 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది టీమిండియా మహిళల జట్టు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. ఈ క్రమంలోనే  కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నలభై మూడు బంతుల్లో 65 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడింది.. రోడ్రిక్స్ 33 పరుగులు చేసింది. అయితే మిగతా బ్యాట్స్మెన్లు నుంచి సహకారం అందలేదు. అదే సమయంలో చివర్లో 3 రన్ ఔట్ లు భారత్ కొంప ముంచాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకే పరిమితమైంది. తద్వారా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చివరికి సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: