ప్రస్తుతం భారత జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రోజుల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీలో ప్రస్తుతం భారత జట్టు బరిలోకి దిగింది. అయితే ఇటీవలే హారారే స్టేడియం వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా భారత జట్టు అద్భుతంగా రాణించి పూర్తి ఆధిపత్యం సాధించింది.  పసికూన జింబాబ్వే జట్టును చిత్తుగా ఓడించింది అని చెప్పాలి. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో సమిష్టిగా రాణించిన భారత జట్టు మరోసారి తమకు తిరుగు లేదు అని నిరూపించింది అని చెప్పాలి.


 ఇటీవల జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది జింబాబ్వే జట్టు. ఈ క్రమంలోనే 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ విభాగం  ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే వికెట్ ఛేదించింది అని చెప్పాలి. ఓపెనర్ జోడీగా వచ్చిన గిల్, శిఖర్ ధావన్ లు అదిరిపోయే ప్రదర్శన చేశారు. అయితే మొదటి వన్డే మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జట్టు ఆటగాళ్లు జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ పై తేనెటీగలు దాడి చేశాయి.


 దీంతో జాతీయగీతం ఆలపానలో నిమగ్నమైన ఇషాన్ కిషన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో అతనికి ఎటువంటి హానీ జరగలేదు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. అయితే గత కొన్ని సిరీస్ ల నుంచి టీమిండియాను ఎంపిక అవుతున్న విషయాన్ని ఇషాన్ కిషన్ బెంజ్ కే పరిమితం అవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో స్టేడియంలో తేనెటీగల దాడి సర్వసాధారణంగా మారిపోయింది. మొన్నటికి మొన్న నెదర్లాండ్స్ లో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో పాకిస్థాన్ బ్యాట్స్మెన్  కూడా ఇలాగే తేన తీగల దాడికి గురి అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: