సాధారణంగా మైదానంలో క్రికెటర్లు ఎంతో బాగా రాణిస్తూ ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు మాత్రం వారిని దురదృష్టం వెంటాడుతు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీగా పరుగులు చేస్తున్నారు అనుకుంటున్న సమయంలోనే ఊహించని విధంగా వికెట్ చేర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలాంటిది ఏదైనా జరిగిందంటే దానికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.  ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత సదరు బ్యాట్మెంటన్ అంత దురదృష్టవంతులు ఇంకెవరూ లేరు అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


 ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగిపోయారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ తో ఓటమి పాలు అయింది. అయితే తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా కెప్టెన్ దురదృష్టకర రీతిలో వికెట్ కోల్పోవడం గమనార్హం.  అప్పటి వరకు అతను 47 పరుగులు చేశాడు డీన్ ఎల్గర్.  దీంతో ఎంతో నిలకడగా రాణిస్తూ ఉన్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే అతనికి దురదృష్టం వెంటాడింది. ఇంకేముంది వికెట్ కోల్పోయాడు. డీన్ ఎల్గర్ ను లైన్  అండ్ లెంగ్త్ బాల్ తో జేమ్స్ అండర్సన్ బోల్తా కొట్టించాడు.


 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఈ సమయంలో ఇరవై మూడువ ఓవర్ వేసిన జేమ్స్ అండర్సన్ వేసిన బంతిని డీన్ ఎల్ గర్ ఆఫ్ సైడ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి నేరుగా తన తై ప్యాడ్ కి తగిలి వికెట్ల వైపు దూసుకు వెళ్తుంది.  అప్రమత్తమైన డీన్ ఎల్గర్ బంతిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ అది వికెట్లను గిరాటేసింది.  అంతేకాదు వికెట్ల పైన ఉన్న బెయిల్ కూడా కిందపడిపోయాయ్. దీంతో అనుకోని విధంగా వికెట్లు కోల్పోయి చివరికి నిరాశతో పెవిలియన్ చేరాడు డీన్ ఎల్గర్. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: