సాధారణంగా భారత క్రికెట్లో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ని మాస్టర్ బ్లాస్టర్ అని పిలుస్తూ ఉంటారు.  మరి కొంతమంది ఇక క్రికెట్ దేవుడు అని కూడా అని అంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో ఏ క్రికెటర్ కి సాధ్యం కాని రీతిలో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత జట్టుకు కెప్టెన్ గా ఒక ఆటగాడిగా ఎన్నో అద్వితీయమైన విజయాలను అందించాడు సచిన్ టెండూల్కర్. ఈ క్రమంలోనే ఏకంగా 5 వరల్డ్ కప్ లు ఆడటంలో కూడా కీలక పాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక సచిన్ భారత క్రికెట్కు చేసిన సేవలకు గాను అతన్ని భారత క్రికెట్ దేవుడు అని ఎంతో మంది అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక రిటైర్మెంట్ ప్రకటించిన ఎన్నో ఏళ్ల తర్వాత ఇటీవలే మళ్లీ సచిన్ టెండూల్కర్ మైదానంలోకి దిగి ఆడుతూ ఉన్నాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా రెండో సీజన్లో భారత్ లెజెండ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు సచిన్ టెండూల్కర్. ఇక ఇటీవల ఇంగ్లాండు లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్లో మరోసారి ప్రేక్షకులందరిని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు సచిన్.


 ఒకప్పుడు యువకుడిగా ఉన్నప్పుడు ఎంతో సొగసైన షాట్లను ఆడుతూ పరుగులు రాబట్టాడో.. ఇప్పుడు 49 ఏళ్ల వయసులోనూ అదే దూకుడుతో బ్యాటింగ్ చేశాడు సచిన్ టెండూల్కర్. 20 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు మూడు సిక్సర్లు ఉండటం విశేషం.  ఇక ఈ మ్యాచ్ లో భారత లెజెండ్స్ జట్టు నలభై పరుగులు తేడాతో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది అని చెప్పాలి. అయితే సచిన్ టెండూల్కర్ మెరుపు ఇన్నింగ్స్ చూసిన ఎంతోమంది అభిమానులు 49 ఏళ్ళ వయసులో ఇలా ఆడటం సచిన్ కే సాధ్యమైందేమో.. అందుకే సచిన్ క్రికెట్ దేవుడు అంటారు అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: