అక్టోబర్ 16వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది . కప్పు గెలవడమే లక్ష్యంగా ప్రతి జట్టు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యాయి అన్ని జట్లు. ఇకపోతే ఇప్పటికే ఇక ప్రపంచ కప్ లో ఆడబోయే తుదిచెట్టు వివరాలను కూడా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.


 ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి కూడా ఎంతోమంది మాజీ క్రికెటర్లు టి20 ప్రపంచ కప్ లో ఏ జట్టు ఎలా రాణించబోతుంది.. ఏ జట్టు చాంపియన్గా నిలిచే అవకాశం ఉంది.. ప్రపంచ కప్ లో ఆడబోయే జట్ల బలాబలాలు ఏంటి అన్న విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ  క్రమంలోనె మాజీ క్రికెటర్ల అభిప్రాయాలు సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి. టీమిండియా ఈసారి వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలుస్తుందని ఎంతోమంది విదేశీ మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.


 ఇలాంటి సమయంలో భారత మాజీ సెలెక్టర్ సభా కరీమ్ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశాడు. వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియానే తన ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చాడు సభా కరీమ్. టి20 ఫార్మాట్లో ఆస్ట్రేలియా జట్టు ఎంతో బలంగా కనిపిస్తోంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇక అంతకుమించి స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవడం ఎంతో కష్టం అంటూ తెలిపాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఆడించాలి అనే విషయంపై టీం మేనేజ్మెంట్కు స్పష్టత ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరోసారి ఆస్ట్రేలియా జట్టే ఛాంపియన్గా నిలుస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు సభా కరీమ్. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి..

మరింత సమాచారం తెలుసుకోండి: