
ఈ గ్రౌండ్లో ఇప్పుడు వరకు కోహ్లీ మూడు ఫార్మట్ లలో కలిపి 8 మ్యాచ్లు ఆడాడు. ఇందులో మూడు టెస్టులు, నాలుగు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఉండడం గమనార్హం. అయితే ఒక సెంచరీ 3 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 607 పరుగులు చేశాడు కోహ్లీ. ఇక 2019లో ఇదే గ్రౌండ్లో వెస్టిండీస్ తో జరిగిన టి20 మ్యాచ్ లో 94 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనె ఇక ఇప్పుడు కోహ్లీకి బాగా అచ్చొచ్చిన మైదానంలో కీలకమైన మూడవ టి20 మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో మరోసారి విరాట్ కోహ్లీ భారీగా పరుగులు చేసే అవకాశం ఉంది అని అభిమానులు భావిస్తూ ఉన్నారు. కాగా ఇప్పుడు వరకు జరిగిన రెండు టి20 మ్యాచ్ లలో మాత్రం కోహ్లీ పెద్దగా రాణించలేదు.
మొదటి మ్యాచ్ లో రెండు పరుగులకే వెనతిరిగిన కోహ్లీ రెండవ టి20 లో 11 పరుగులు మాత్రమే చేశాడు. మరి నేడు ఎలా రానిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మకు ఉప్పల్ స్టేడియం మాత్రం కలసిరాని వేదికగా కొనసాగుతోంది. ఈ గ్రౌండ్ లో ఇప్పుడు వరకు రోహిత్ శర్మ మూడు మ్యాచ్లు ఆడితే కేవలం 46 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ పించ్ కి కూడా ఉప్పల్ స్టేడియం కలిసి రాలేదు. 2019 మార్చి రెండవ తేదీన భారత్ తో ఇదే వేదికపై జరిగిన వన్డే మ్యాచ్లో భారీ అంచనాల మధ్య బ్యాటింగ్ కి వచ్చిన ఆరోన్ ఫించ్ డకౌట్ గా వెనుతిరిగి విమర్శలు ఎదుర్కొన్నాడు. మరి నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు ఎలా రాణిస్తారో చూడాలి.