సాధారణంగా క్రికెటర్లు ఎక్కడికైనా వెళ్లారు అంటే చాలు అక్కడ ఉన్న అందమైన ప్రదేశాలను వీక్షించడం అక్కడ ఉండే స్పెషల్ ఫుడ్స్ టేస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇకపోతే టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా ఇటీవలే మూడవ టి20 మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ చేరుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఎంతో స్పెషల్ వంటకమైనా బిర్యానీ రుచి చూశారు కొంతమంది క్రికెట్ ఆటగాళ్లు.  ఈ క్రమంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అయ్యాడు అని తెలుస్తుంది. ఇటీవలే మూడవ టి20 మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన రోహిత్ శర్మ జట్టు సభ్యులతో కలిసి బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో బస చేశారు.


 ఇకపోతే మల్కాజ్గిరి లో నివసించే భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆహ్వానం మేరకు కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ కే ఎల్ రాహుల్, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా మిగతా కోచింగ్ సిబ్బంది అసిస్టెంట్లతో కలిసి ఆయన ఇంటికి విందు చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే గోల్కొండ హోటల్ నుంచి తీసుకువచ్చిన బిర్యాని వారికి విందుగా వడ్డించాడు భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్. ఈ క్రమంలోని హైదరాబాది స్పెషల్ అయిన బిర్యాని టేస్ట్ చూసి రోహిత్ శర్మ ఫిదా అయ్యాడట. అంతేకాదు ఇక గోల్కొండ హోటల్ సిబ్బందితో రోహిత్ శర్మ సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఇక ఈ విందు కు వెళ్లిన మిగతా సిబ్బంది కూడా హైదరాబాద్ బిర్యానీ రుచి చూసి మైమార్చిపోయారు అన్నది తెలుస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మూడో టి20 మ్యాచ్ లో పూర్తి ఆదిపత్యాన్ని కనబరిచిన టీమిండియా విజయం సాధించింది. తద్వారా 2-1 తేడాతో  సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. టీమిండియా. ప్రపంచ కప్ కి ముందు టీం ఇండియాకు ఈ సిరీస్ విజయం మంచి బూస్ట్ లాంటిది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: