ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ డైలాగ్ అచ్చంగా ఈ డైలాగ్ కి సరిపడా ఆట తీరితో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. రిషబ్ పంత్ తో పాటు అండర్ 19 జట్టులో ఆడినప్పటికీ రిషబ్ పంతుతో పోల్చి చూస్తే చాలా లేటుగానే టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్నాడు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్న విధంగానే తనఆట పేరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.


 తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో తక్కువ సమయంలోనే మిస్టర్ 360 ప్లేయర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఎందుకంటే మైదానంలోని నలువైపులా కూడా సిక్సర్లు ఫోర్లు కొడుతూ అదరగొడుతూ ఉన్నాడు. ఇక ఎప్పుడూ భారీ ఇన్నింగ్స్ ఆడుతూ టీమ్ ఇండియాకు విజయాన్ని అందిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సూర్య కుమార్ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు ఎంతో చూడముచ్చటగా ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సూర్య కుమార్ యాదవ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలీ.



 ఎలాంటి బౌలర్ తనకు బౌలింగ్ చేస్తున్న కూడా సిక్సర్లతో చెలరేగిపోతూ ఉంటాడు సూర్య కుమార్ యాదవ్. ఏ బంతిని ఎటువైపు నుంచి షాట్ కొడతాడో అన్నది  ఊహకంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే టీం ఇండియా తుదిచెట్టులో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేశాడు అంటే చాలు ఇక అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడం ఖాయం అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు సూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మాట్ లోకి అరంగేట్రం చేసిన నాటి నుంచి అందరికంటే ఎక్కువగానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు సూర్య కుమార్ యాదవ్.

మరింత సమాచారం తెలుసుకోండి: