వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ల చితక్కొట్టుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక్కసారి క్రీజు లోకి వచ్చారు అంటే చాలు నిలబడిన చోటు నుండే భారీ సిక్సర్లు కొడుతూ ఉంటారు. వాళ్ల హిట్టింగ్ ఆ రేంజ్ లో ఉంటుంది. అందుకే వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు ఎప్పుడైనా బ్యాటింగ్ చేస్తూ క్రీజ్ లో కుదురుకున్నారు అంటే ఇక వాళ్ళని అవుట్ చేయడం అటు బౌలర్లకు కత్తి మీద సాముల మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక మైదానంలో భారీగా,సరికొత్తగా సిక్సర్లు కొట్టడంలో వెస్టిండీస్ బ్యాట్స్మన్  లది  ప్రత్యేకమైన శైలి ఇప్పటికే క్రిస్ గేల్, కిరణ్ పోలార్డ్, ఆండ్రూ రసెల్, జాసన్ హోల్డర్, కార్లోస్ బ్రాత్ వైట్, షిమ్రాన్ హెట్ మేయర్  ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆటగాళ్లు పవర్ఫుల్ హిట్టింగ్ తో సిక్సర్లు పోర్లతో చెలరేగిపోతూ అటు జట్టును ఒంటి చేత్తో విజయాలను అందించగలిగే సత్తా ఉన్నోళ్లు ఉన్నారు అని చెప్పాలి.


 అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది బ్యాట్స్మెన్లు ఎంతో సొగసైన షాట్లు ఆడుతూ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటారు. ఇంకొన్నిసార్లు బ్యాట్స్మెన్లు కొట్టే సిక్సర్లు క్రికెట్ చరిత్రలోనే ఆరుదైనవి అయ్యి ఉంటాయి అని ప్రేక్షకులు భావన కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి.  ప్రస్తుతం ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ చెక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.. వెస్టిండీస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల మొదటి టి20 మ్యాచ్ జరిగింది. ఈ మొదటి టి20 మ్యాచ్ లో భాగంగా నాలుగో ఓవర్లో కైల్ మేయర్స్ ఓ అద్భుతమైన షాట్ ఆడాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ని కెమెరాన్ గ్రీన్ వేసాడు.

 ఈ క్రమంలోనే ఆ ఓవర్ మూడో బంతిని గ్రీన్ షార్ట్ ఫిచ్ బంతిగా వేయగా.. బ్యాక్ ఫుట్ లో ఉన్న బ్యాటర్ కైల్ మేయర్స్ కవర్స్ వైపుగా భారీ షాట్ ఆడాడు. 143 కిలోమీటర్ల వేగంతో దూసుకు వచ్చిన బంతిని ఎంతో సొగసైన షాట్ తో సిక్సర్ గా మలిచాడు బ్యాటర్.  ఈ సిక్సర్ కు  సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా సదరు బ్యాట్స్మెన్ షాట్ సెలక్షన్ సమయ పూర్తికి అభిమానులతో పాటు ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు మాజీ క్రికెటర్లు కూడా ఫిదా అయిపోతున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: