ఈ క్రమం లోనే ఇటీవలే పెరు వేదికగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో అటు భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా ఎప్పటిలాగానే సూర్య కుమార్ యాదవ్ మరోసారి తన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 35 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. మొత్తంగా 20 ఓవర్లలో టీమిండియా 158 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలివన్ జట్టు 145 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో 13 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
ఇదిలా ఉంటే టీమ్ ఇండియా జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ మ్యాచ్లో మునిగితేలుతూ ఉంటే అటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రం విశ్రాంతి తీసుకున్నారు. అయితే విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలోకి వచ్చి బౌండరీ వద్ద ఉన్న కొందరు అభిమానులను కలిశాడు. ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. కోహ్లీ ఇలా అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తుండగా మైదానంలో ఉన్న అభిమానులు అందరూ కూడా కోహ్లీ కోహ్లీ అంటూ గట్టిగా అరవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి