ముఖ్యంగా ఓపెనర్ కుషాల్ మొండిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో బౌలింగ్లో హస్సరంగా నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇకపోతే అటు కుషాల్ మొండిస్ ఇన్నింగ్స్ లో భాగంగా ఐదు సిక్సర్లు ఐదు ఫోర్లు ఉండడం గమనార్హం. ఏకంగా 179 స్ట్రైక్ రేట్ తో అతను బ్యాటింగ్ చేశాడు. అతని ఇన్నింగ్స్ కారణంగానే శ్రీలంక 162 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత నెదర్లాండ్స్ ను 146 పరుగులకే పరిమితం చేసింది శ్రీలంక బౌలింగ్ విభాగం. తద్వారా విజయం సాధించింది.
అయితే గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో బయోబబుల్ నిబంధనలను ఉల్లంఘించి చివరికి నిషేధాన్ని ఎదుర్కొన్న కుషాల్ మొండిస్ నేడు అదే జట్టు ను కీలక సమయంలో ఆదుకొని టి20 ప్రపంచ కప్ లో సూపర్ 12కూ చేర్చాడు. ఇలా ఏకంగా శ్రీలంక విజయంలో కీలక పాత్ర వహించి హీరోగా మారిపోయాడు అని చెప్పాలి ఈ క్రమంలోనే ఒకప్పుడు బ్యాన్ అయిన ఆటగాడే ఇక ఇప్పుడు అదే జట్టులో సూపర్ హీరో అయిపోయాడు అంటూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి