ఈనెల 16వ తేదీ నుంచి టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. అయితే నిన్నటి వరకు కూడా పలు జట్ల మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్లు జరిగాయి అని చెప్పాలి. ఇక ఈ క్వాలిఫైయర్ మ్యాచ్లు కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతూ అటు ప్రేక్షకులు అందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న సూపర్ 12 మ్యాచ్లు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఇకపోతే ఈ ఏడాది ఎన్నో జట్లు ఎంతో పట్టిష్టంగా కనిపిస్తున్న నేపద్యంలో ఇక ప్రతి మ్యాచ్ నరాలు తిరిగే ఉత్కంఠ మధ్య జరుగుతుందని ఎంతోమంది అంచనా వేశారు.


అంతేకాదు టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఎన్నో రికార్డులు బద్దలవుతాయని.. ఇక ఎంతో మంది ఆటగాళ్లు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారు అన్న విషయం కూడా  ముందుగానే ఊహించారు క్రికెట్ అభిమానులు. అందరూ అనుకున్నట్లుగానే నేటి నుంచి ప్రారంభమైన సూపర్ 12 మ్యాచ్ లలో భాగంగా మొదటి మ్యాచ్ నుంచి ఎన్నో రికార్డులు కొట్టడం మొదలుపెట్టారు ప్లేయర్లు. ఈ క్రమంలోనే ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి ఒక ప్రపంచ రికార్డు నమోదయింది అని చెప్పాలి.


 న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు కివిఎస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఫేసర్ టిమ్ సౌదీ అరుదైన ఘనత సాధించాడు. ఇటీవల  వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో వార్నర్ వికెట్ తీసిన టిమ్ సౌదీ టి20 అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు 101 మ్యాచ్ లు ఆడిన టిమ్ సౌదీ  మొత్తం 125 వికెట్లు తీశాడు అని చెప్పాలి. అంతకుముందు అత్యధిక వికెట్లు 122 రికార్డు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షేకీబుల్ హసన్ పేరిట ఉండగా.. ఇప్పుడు ఈ రికార్డు టిమ్ సౌదీ బద్దలు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: