దయాధులకు సమరానికి వేలయ్యింది.. ఎన్నో రోజుల నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరిని ఊరిస్తున్న భారత్,పాకిస్తాన్ మ్యాచ్ నేడు జరగబోతుంది. చిరకాల ప్రత్యర్థులు అయిన ఈ రెండు జట్లు కూడా మరోసారి మైదానంలో దిగి హోరాహోరీగా పోట్లాడేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకోవడమే లక్ష్యంగా పదునైన వ్యూహాలతో బరిలోకి దిగడానికి రెడీ అయ్యాయి. ఏకంలోనే ప్రపంచ కప్ లో భాగంగా మెల్ బోర్న్  వేదికగా జరగబోయే దాయాదుల పోరు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇక పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ లో అటు టీమ్ ఇండియా తుదిజట్టు ఎంపిక ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అదే సమయంలో గత కొంతకాలం నుంచి టీమిండియా వరుసగా తుది జట్టును మారుస్తూ ప్రయోగాలు చేస్తూ ఉంది. అయితే అటు ప్రపంచ కప్ లో మాత్రం ఇలాంటి ప్రయోగాలకు టీమిండియా చెక్ పెట్టే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. అయితే ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ కూ ముందే టీమిండియా వ్యూహాలు ఏంటి అనే విషయంపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 వరల్డ్ కప్ లో భారత జట్టుపై ప్రేక్షకులు అందరూ కూడా భారీగా అంచనాలు పెట్టుకుంటారు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే అవసరమైతే ప్రతి మ్యాచ్ కి కూడా తుదిచెట్టులో మార్పులు చేర్పులు చేస్తామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఇలా రోహిత్ చేసిన వ్యాఖ్యలు విని అటు అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. వరల్డ్ కప్ లో  ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్లు ఆడటం వల్ల ఉపయోగం ఉంటుందని తరచూ తుదిజట్టులో మార్పులు చేయడం వల్ల సమన్వయ లోపం కారణంగా జట్టు వైఫల్యం చెందే అవకాశం ఉందని.. అలాంటి రిస్కులు చేయొద్దని టీమిండియా అభిమానులు కోరుతున్నారు. మరి దీనిపై మీరేం అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: