ఇక ఇలా తన పర్సనల్ రూమ్ వీడియో లీక్ కావడంపై విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి అభిమానులు నాకు వద్దు అంటూ ఘాటుగానే స్పందించాడు. అయితే ఇక ఈ వీడియో లీక్ అవడంపై హోటల్ యాజమాన్యం కూడా క్షమాపణలు చెప్పింది. అయితే ఈ ఘటనపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ పర్సనల్ రూమ్ వీడియో లీక్ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు అని చెప్పాలి. ఇటీవల టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రికెటర్లు స్వేచ్ఛగా ఉండే ఏకైక చోటును కూడా వారికి లేకుండా చేయడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు.
ఫోన్లో కెమెరాలతో మీరు బహిరంగ ప్రదేశంలో ఉన్నప్పుడు వీడియో తీయడానికి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వీడియో తీయడానికి ఎంతో వ్యత్యాసం ఉంది అంటూ తెలిపాడు. విరాట్ కోహ్లీ విషయంలో జరిగింది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. మీరు కారులో ప్రయాణిస్తుంటారు మ్యాచ్ కు వెళ్లేందుకో లేక ఇంకేదైనా పని మీద బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు కెమెరాలు లోపలికి దూసుకొచ్చి మనల్ని చిత్రీకరిస్తే ఎలా ఉంటుంది. అది ఒక వ్యక్తి గోప్యతను హరించడం అవుతుందో లేదో తెలియదు కానీ హోటల్ రూమ్ లోకి వచ్చి వీడియో తీస్తే మాత్రం అది వ్యక్తిగత గోప్యుతకు భంగం కలిగించినట్లే అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి