ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిందంటే చాలు అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత క్రికెట్ ప్రేక్షకులు అయితే క్రికెట్ మాయలో మునిగి తేలుతూ ఉంటారు. ఇక ప్రతి మ్యాచ్ నూ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అటు 2023 ఐపీఎల్ సీజన్ కోసం ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఫ్రాంచైజీలు ఇక తమ జట్టును మరింత పటిష్టంగా మార్చుకునేందుకు ప్రణాళికలు మొదలుపెట్టాయి అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే గత సీజన్లో చేసిన తప్పిదాలను మళ్లీ పునరావృతం చేయకుండా ఇక ఆయా జట్టు ఫ్రాంచైజీలు ఇక జట్టులోని ఆటగాళ్ల ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నాయ్. ఈ క్రమంలోనే అటు జట్టులో ఉన్న ఆటగాళ్లు మాత్రమే కాదు కెప్టెన్లను కూడా మార్చి ఇక సరికొత్తగా ఐపీఎల్లో ఆటను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే డిసెంబర్లో ఐపీఎల్ వేలం జరగబోతుంది అన్న టాక్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లను వదులుకునేందుకు ఆయా జట్ల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. అయితే గతంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా  రాహుల్ ఉండగా అతని జట్టు యాజమాన్యం వదులుకోవడమె కాదు అటు మయాంక్ అగర్వాల్ కు  కెప్టెన్సీ అప్పగించింది.


 అతను కెప్టెన్గా ఒక ఆటగాడిగా కూడా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఇక అతను కెప్టెన్సీ నుంచి తప్పించి ఇటీవల తరచూ టీమిండియా కెప్టెన్సీ అందుకుంటున్న శిఖర్ ధావన్ కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఇక 2023 ఐపీఎల్ నుంచి అతను జట్టు పగ్గాలు చేపట్టబోతున్నాడట. ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్లో పంజాబ్ పేలువ ప్రదర్శన చేసి ఆరవ స్థానానికి పరిమితమైంది. తద్వారా కెప్టెన్ ను మార్చాలని ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: