టీమిండియాలో చోటు దక్కించుకొని తనదైన ప్రదర్శనతో అదరగొట్టాలని ఎంతగానో ఎదురు చూస్తున్న సంజు శాంసన్ గత కొంతకాలం నుంచి ఎంతో నిరీక్షణగా టీమిండియాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల వరల్డ్ కప్ లో సంజు శాంసన్ ను ఎంపిక చేయకపోవడంపై అటు అభిమానులు ఎంతలా నిరసన తెలిపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడినా కూడా సంజు సంజు అంటూ అరుస్తూ వెంటనే టీమిండియాలోకి సెలక్ట్ చేయాలి అని తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు.


 ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి ఇక టి20 జట్టుకు దూరమైన సంజు శాంసన్ న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్తో జరగబోయే టి20 సిరీస్ కు టీమ్ ఇండియా అన్ని విధాలుగా సన్నద్ధం అయ్యింది అని చెప్పాలి.  ఇక నేడు 12 గంటలకు మ్యాచ్ జరగబోతుంది.. ఈ క్రమంలోనే ఇక టీమిండియా న్యూజిలాండ్తో జరగబోయే టి20 సిరీస్ కి ముందు ప్రాక్టీస్ లో చెమటోడ్చినా  వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ముఖ్యంగా సంజు శాంసన్ అయితే నెట్స్ లో తీవ్రంగా చెమటోడుస్తున్నాడు


 ప్రాక్టీస్ సెక్షన్లో భాగంగా సంజు శాంసన్ నో లుక్ షాట్స్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొడుతుంది. కోచింగ్ సిబ్బందిలో ఒకరు బౌలింగ్ చేయగా.. సంజు శాంసన్ బంతిని చూడకుండానే భారీ సిక్సర్ గా మలిచాడు. ఇక ఈ వీడియోని బీసీ సీఐ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. దీంతో ఇక ఇది చూసి సంజు అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు. ఇక ఈ వీడియోలో సంజు శాంసన్ తో పాటు రిషబ్ పంత్ దీపక్ హుడా శ్రేయస్ అయ్యర్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: