2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి  రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఐపీఎల్ లో పాల్గొంటున్న 10 జట్లు కూడా తాము వదిలేసుకోబోయే ఆటగాళ్ల వివరాలను ఇటీవల బీసీసీఐకి అందించాయ్. అంతేకాకుండా ఇక తమతో అంటిపెట్టుకున్న ప్లేయర్ల జాబితానికి కూడా అందించాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవలే కొంతమంది ఆటగాళ్లను వదులుకుంటున్నట్లు ప్రకటించింది.


 అయితే ఇలా చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి  వదిలేస్తున్న ఆటగాళ్ల జాబితాలో నారాయన్ జగదీషన్ పేరు కూడా ఉంది అని చెప్పాలి. ఈ పేరు ఉన్నప్పటికీ మొదట ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.  కానీ ఇటీవల విజయ హజారే ట్రోఫీలో భాగంగా నారాయణ్ జగదీషణ్ సెంచరీ తో చెలరేగిపోవడం.. ఏకంగా ఒకే సీజన్లో ఐదు సెంచరీలు సాధించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం.. అంతేకాకుండా 277 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్గా కూడా రికార్డుకొట్టడంతో అతని పేరు మారుమోగిపోయింది. దీంతో ఇంత అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఆటగాడిని వదిలేసుకొని చెన్నై సూపర్ కింగ్స్ తప్పు చేసిందని ఎంతోమంది అభిప్రాయపడ్డారు.


 అయితే గతంలో కనీస ధర 20 లక్షలకు నారాయణ్ జగదీషణ్ ను కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.  కానీ ఇప్పుడు అతన్ని వేలంలోకి వదిలేయడంతో ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్ మినీ వేలంలో అతనికి భారీ ధర పలికే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఎన్నో ఫ్రాంచైజీలు అతని సొంతం చేసుకున్నందుకు పోటీపడే ఛాన్స్ ఉందని అనుకున్నారు. అయితే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తనని వేలంలోకి వదిలేయడం పై స్పందించిన నారాయన్ జగదీషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నన్ను వదిలేయడం.. వదిలేయకపోవడం  అనేది వారి నిర్ణయం.. అయితే దానిని నేను ఆపలేను. కానీ ఎలా ఆడాలి అన్నది మాత్రమే నా ఆధీనంలో ఉంటుంది అంటూ నారాయన్ జగదీషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: