ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు అక్కడ వరుసగా సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్లతో వరుసగా సిరీస్ లు ఆడుతుంది భారత జట్టు. ఈ క్రమంలోనే ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ లో భాగంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరీలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షార్ఫలం కావడం ఇక రెండవ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడం.. మూడవ మ్యాచ్ లో అటు వర్షం కారణంగా మ్యాచ్ టైగా ముగియడంతో ఒక్క మ్యాచ్ గెలిచిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.


 ఇలా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా శుభారంభం చేసింది అని చెప్పాలి. అయితే ఇక అదే జోష్ ల్ ఇటీవలే శిఖర్ ధావన్ కెప్టెన్సీలో  వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఆడింది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో మొదట టీమిండియా గెలిచేలాగే కనిపించినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు విజృంభించి ఆడటంతో చివరికి న్యూజిలాండ్  మొదటి వన్డే మ్యాచ్లో విజయం సాధించింది అని చెప్పాలి.


 అయితే మొదటి వన్డే మ్యాచ్లో అటు న్యూజిలాండ్ విజయం సాధించినప్పటికీ టీమిండియా ఓపెనింగ్ విభాగం మాత్రం ఒక అరుదైన రికార్డు సృష్టించింది అని చెప్పాలి. ఆక్లాండ్ గడ్డపై తొలిసారి వన్డే ఫార్మాట్ లో 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది భారత జట్టు. ఇటీవల జరిగిన మ్యాచ్లో ఓపెనర్లు శిఖర్ ధావన్ శుభమన్ గిల్ కలిసి 124 పరుగులు చేశారని చెప్పాలీ. కాగా 2003లో ఒక అప్పటి టీమ్ ఇండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ కలిసి 70 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పుగా ఇప్పటివరకు ఇదే అత్యధికంగా కొనసాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: