బీసీసీai ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతలా పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. అయితే ఈ లీగ్ లో భాగం కావాలని విదేశీ క్రికెటర్లు కూడా ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఐపీఎల్ లో పాల్గొనడం కారణంగా అటు కోట్ల రూపాయల ఆదాయంతో పాటు ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించేందుకు అవకాశం ఉంటుంది.


 అన్నింటికీ మించి ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకొని ఇక సరికొత్త అనుభవాలను సాధించేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి. అందుకే విదేశీ క్రికెటర్లు అటు ఐపిఎల్ లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ఏ జట్టులో ఉన్నా కూడా తమ ఆట తీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఇలా ఐపిఎల్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆస్ట్రేలియా ప్లేయర్లలో షేన్ వాట్సన్ కూడా ఒకరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో వివిధ జట్ల తరఫున ఆడిన షేన్ వాట్సన్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో  ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అప్పుడప్పుడు బౌలింగ్ కూడా చేసి అదరగొట్టాడు. అయితే ఇటీవల ఐపీఎల్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. 2016 ఐపిఎల్ ఫైనల్స్ నా కెరియర్ లోనే వరస్ట్ గేమ్లలో ఒకటి అంటూ షేన్ వాట్సన్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా నా బౌలింగ్ అంత చెత్తగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏకంగా నాలుగు ఓవర్లలో 61 పరుగులు ఇచ్చాను అంటూ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్  2019 ఐపీఎల్ ఫైనల్స్ లో కాలుకు గాయమైన పోరాడిన ఇన్నింగ్స్ మా ఫేవరెట్ అంటూ  కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl