గత కొంతకాలం నుంచి భారత జట్టులో సంజూ శాంసన్ కు సరైన అవకాశాలు రాకపోవడం పై అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలెక్టర్లు కావాలని సంజూ శాంసన్ విషయంలో వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. సరిగ్గా ఆడని రిషబ్ పంత్ కు వరుసగా అవకాశాలు ఇస్తున్న సెలెక్టర్లు మంచిగా ఆడిన కూడా ఎందుకు సంజూ శాంసన్ ను పక్కన పెడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు లేకుండా పోయారు అని చెప్పాలి.


 అయితే సంజూ శాంసన్ కు ఇటీవలే టీమ్ ఇండియాలో సరైన అవకాశాలు రాకపోవడం పై  సంజు శాంసన్ చిన్ననాటి కోచ్ బిజు జార్జ్ స్పందించాడు. సోషల్ మీడియాలో ఎంతోమంది రిషబ్ పంత్ ను విమర్శిస్తున్నారు. అయితే పంత్ ఎప్పటి నుంచో టీమ్ ఇండియాలో ఆడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నాడు.  సంజు శాంసన్ కి రిషబ్ పందికి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కేరళ అభిమానులు కాస్త ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. అయితే ఇది ఏ మాత్రం సరైనది కాదు. సంజు అంశాన్ని బీసీసీఐకి వ్యతిరేకంగా మలుస్తున్నారు. ఈ విషయంలో క్రికెట్ ను రాజకీయం చేసేందుకు అక్కడి నాయకులు ప్రయత్నిస్తున్నారు. వివిఎస్ లక్ష్మణ్ లాంటి వారు కోచ్ గా ఉండగా ఆటగాళ్లను తొక్కేయడం లాంటిది ఎక్కడ జరగవు అంటూ బిజు జార్జ్ చెప్పుకొచ్చాడు.


 చాలామంది బౌలర్లు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కు బౌలింగ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తారు. అందుకే జట్టులోకి లెఫ్ట్ హ్యాండర్ ను తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని ఎంతో మంది చెబుతూ ఉంటారు. కానీ నేను దానిని అస్సలు నమ్మను. ఎందుకంటే ఆడే వాడి దగ్గర నైపుణ్యం ఉంటే ఏ చేతితో అయినా ఆడతాడు. సంజు శాంసన్ ఫినిషర్ గా అదరగొడతాడు. అవకాశాల విషయంలో సంజూ శాంసన్ సూర్యకుమాను స్పూర్తిగా తీసుకోవాలీ. ఎందుకంటే 2015లో జింబాబ్వేతో టి20 సిరీస్ ద్వారా జట్టులోకి వచ్చిన సూర్య కుమార్ మళ్ళీ ఐదేళ్ల తర్వాత 2020లో పూణేలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రీ ఎంట్రీ  ఇచ్చాడు అంటూ గుర్తు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: