దాదాపు దశాబ్ద కాలం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండు జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఏకంగా పాకిస్తాన్ గడ్డపై కూడా ఇంగ్లాండు అద్భుతంగా రానిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ ఆట తీరుతో ఎన్నో రికార్డులు కొలబడుతున్నారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ లో ఎన్నో రికార్డులు నమోదు అవుతున్నాయి అని చెప్పాలి.


 సాధారణంగా టెస్ట్ ఫార్మాట్ అంటే క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ ఆచి తూచి  ఆడుతూ ఉంటారు. అంతేకాదు సింగిల్స్ తీస్తూ ఇక పరుగుల బోర్డును నత్త నడుకన నడిపిస్తూ ఉంటాడు. టి20 ఫార్మాట్లో లాగా ఉరుములు మెరుపులు టెస్ట్ ఫార్మట్ లో ఎక్కడ కనిపించవు అని చెప్పాలి.అందుకే అటు ప్రేక్షకులు సైతం టెస్టు ఫార్మాట్లో మ్యాచ్ జరుగుతుంది అది చూసేందుకు తెగ బోరింగ్ ఫీల్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ మాత్రం ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచింది.


 ఇక ఈ టెస్ట్ మ్యాచ్ చూసిన ప్రతి ఒక ప్రేక్షకుడి మదిలో ఒకే ప్రశ్న ఎదురుతూ ఉంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు టెస్ట్ సిరీస్ ఆడటానికి వచ్చాము అన్న విషయం మరిచిపోయినట్టున్నారు.. ఇంకా ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ గెలిచిన ఆలోచనతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు అంటూ అనిపించింది. ఎందుకంటే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ ఆటగాళ్ల విధ్వంసంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏకంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయబడింది. తొలిరోజు ఆటలోనే 500 పరుగులు పూర్తి చేసిన ఇంగ్లాండు జట్టు 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. అంతేకాదు మొదటి రోజే నలుగురు బ్యాట్స్మెన్లు సెంచరీ చేసి రికార్డు సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: