ప్రస్తుతం టీమిండియా జట్టు బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వన్డే సిరీస్ లో భాగంగా ఇటీవలే మొదటి మ్యాచ్ లో జరిగింది. అయితే ఈ మొదటి వన్డే మ్యాచ్లో గెలుస్తుంది అనుకున్న భారత జట్టు కాస్త ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు బ్యాటర్ల వైఫల్యం మరోవైపు బౌలర్ల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపించింది. అయితే ఇలా ఎంతో బలహీనమైన బంగ్లాదేశ్ పై కూడా భారత జట్టు గెలవలేక ఓడిపోవడంతో ఎంతో మంది భారత అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి.


 కేవలం భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు మాజీ ఆటగాళ్లు సైతం బంగ్లాదేశ్ చేతిలో మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా తదుపరి మ్యాచ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు తీరుపై మాజీ మాచి ఆటగాడు మహమ్మద్ కైఫ్ సైతం స్పందించాడు. టీమ్ ఇండియా ఓడిపోయినప్పుడు కేవలం బౌలర్లను మాత్రమే తప్పు పట్టడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు.


 మొదటి వన్డే మ్యాచ్లో చెత్త బ్యాటింగ్ కారణంగానే బంగ్లాదేశ్ జట్టు చేతిలో రోహిత్ సేన ఓడిపోయింది అంటూ పేర్కొన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా రోహిత్ శర్మ బ్యాట్ జులిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. ఇటీవల సోనీ స్పోర్ట్స్ షో లో పాల్గొన్న మహమ్మద్ కైఫ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరూ బౌలర్ల పైనే విమర్శలు చేస్తున్నారు.. నిజానికి కేవలం బ్యాటింగ్ వైఫల్యం వళ్లే టీమిండియా ఓడిపోయింది అంటూ మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: