సాధారణంగా  ఒక క్రికెట్ ప్లేయర్ బాగా రాణించినప్పుడు పొగడ్తలతో ముంచేయడం ఇక పేలవ ప్రదర్శన చేసినప్పుడు.. అప్పుడు వరకు చేసిన మంచి ప్రదర్శన గురించి మరిచిపోయి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం క్రికెట్ ప్రేక్షకులకు అలవాటే అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు మైదానంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఇక ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా పరుశమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు ఇక ఈ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఉంటారు. ఇంకొన్నిసార్లు మాత్రం ఇక ప్రేక్షకులు చేసే వ్యాఖ్యలతో ఇబ్బంది పడి ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా వీడియోనే వెలుగులోకి వచ్చింది. ఏకంగా క్రికెటర్ ను ఇరిటేట్ చేశారు ప్రేక్షకులు. దీంతో సహనం కోల్పోయిన ఆ క్రికెటర్ ఏకంగా వారిపై దాడి చేసేందుకు దూసుకుపోయాడు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ గా ఉన్న హాసన్ అలీ ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఒక లోకల్ మ్యాచ్లో పాల్గొన్నాడు.  పంజాబ్ ప్రావిన్స్ లోని పక్ పతన్ జిల్లాలో ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు హాసన్ అలీ. ఇక అక్కడ మ్యాచ్ చూడడానికి వచ్చిన కొంతమంది ఆకతాయిలు హాసన్ ఆలీని హేళన చేస్తూ మాట్లాడారు. జట్టులో చోటు కోల్పోయి గల్లీ క్రికెట్ ఆడటానికి వచ్చావా.కనీసం సిగ్గు లేదా అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు అని చెప్పాలి. అయితే ఇలా ఆకతాయిల మాటలను ఎంతో ఓపికగా భరించిన హసన్ అలీ వాళ్లని ఏమీ అనలేదు. అయితే ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన ప్రేక్షకులు అతనిపై గడ్డి పేపర్లను విసిరారు. దీంతో సహనం కోల్పోయిన హసన్ అలీ తనను హేళన చేసినవారిని కొట్టడానికి  దూసుకుపోయాడు. ఇక మిగతావారు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: