బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 11 ఓవర్లు వేసిన షకీబ్ ఉల్ హసన్ ఇక రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం ఒక్కో ఓవర్ కూడా వేయలేదు. ఈ క్రమంలోనే ఇక అతని కెప్టెన్సీ పై విమర్శలు గుప్పించాడు. షాకీబ్ ఆల్ హసన్ నాయకత్వంలో ఆడేందుకు ఆటగాళ్లు అస్సలు ఇష్టపడరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతే కాకుండా బౌలర్లను వినియోగించుకోవడంలో అతను ఘోరంగా విఫలం అయ్యాడు అంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హసన్ లో సారధ్య చతురత లోపించింది అంటూ చెప్పుకొచ్చాడు.
అందుకే జట్టు లో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న లీటన్ దాస్ ను కెప్టెన్ గా నియమిస్తే బాగుంటుంది అంటూ కనేరియా ఒక సలహా ఇచ్చాడు అని చెప్పాలి. ఇటీవల టెస్ట్ మ్యాచ్లో భాగం గా షకీబ్ ఉల్ హసన్ బౌలింగ్ చేయడం లో విఫలమయ్యాడు. ఇక జట్టులో మంచి ఫేసర్ గా ఉన్న ఖలీల్ అహ్మద్ను కూడా సరిగా వినియోగించు కోలేకపోయాడు. అతని నాయకత్వం ఎప్పుడు ఉన్నతంగా ఉండదు. అందుకే సభ్యులు అతని కెప్టెన్సీలో ఆడటానికి అసలు ఇష్టపడరు. అతను మంచి ఆటగాడు కానీ మంచి కెప్టెన్ మాత్రం కాదు అంటూ కనేరియా వ్యాఖ్యానించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి