సాధారణంగా ఇండస్ట్రిలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సంబంధించిన విషయం ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.  కేవలం సినిమా అప్డేట్స్ మాత్రమే కాదు ఇక హీరోలు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి కూడా అభిమానులు ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హీరోల న్యూ లుక్ ఫోటోలతో పాటు త్రో బ్యాక్ ఫోటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.


 ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు చిన్ననాటి వయసులో అప్పటి స్టార్ హీరోలతో కలిసి ఫోటోలు దిగడం ఇలాంటి ఫోటోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఫోటోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ తిరుగులేని క్రేజ్ తో సూపర్ హిట్స్ సాధిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే తాను హీరోగా ఎదగడమే కాదు ఇక మెగా అనే ఒక బ్రాండ్ ను స్థాపించి తన ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీకి పరిచయం కావడానికి కారణమయ్యారు చిరంజీవి.



 ఇకపోతే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి త్రో బ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ ఫోటోలో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రేమగా ఒక బుడ్డోడు చెంపలు గిల్లుతూ కనిపిస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఈ ఫోటో అభిమానులు అందరినీ ఆకర్షిస్తుంది. అయితే మెగాస్టార్ పక్కన ఉన్న ఈ బుడ్డోడు ఇప్పుడు స్టార్ హీరో అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక మెగాస్టార్ పక్కన ఉన్న ఆ బుడ్డోడు ఎవరో కాదు మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ తేజ్.. ముకుంద సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన వరుణ్.. సూపర్ హిట్ సాధించి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకడిగా  కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: