
ఒకవైపు గాయాల బెడద వేధిస్తున్నప్పటికీ ఎంతో వేగంగా పుంజుకుని మళ్ళీ ఇక జట్టులో భాగం అవుతూ ఉంటాడు జేమ్స్ అండర్సన్. ఇకపోతే ఇప్పుడు వరకు ఎన్నో ప్రపంచ రికార్డులను సాధించిన జేమ్స్ అండర్సన్ ఇక ఇటీవలే న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇటీవలే న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో జేమ్స్ అండర్సన్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు పడగొట్టి ఇక మంచి బౌలింగ్ చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు.
గడిచిన 21 ఏళ్ళలో ఏడాదికి కనీసం ఒక్క వికెట్ అయినా తీసిన బౌలర్గా జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 2002లో అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చాడు జేమ్స్ అండర్సన్. అప్పటి నుంచి ఇక ప్రతి ఏడాది కూడా ఒక్క వికెట్ అయినా తీస్తూ వస్తూ ఉన్నాడు.మొత్తంగా 177 టెస్టులలో 677 వికెట్లు తీశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్లలో ఇక మూడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు జేమ్స్ అండర్సన్ అసమాన్యమైన ప్రదర్శన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.