
ఇలాంటి సమయంలో ఇక మొదటి టెస్ట్ ఓటమితో నిరాశలో మునిగిన ఆస్ట్రేలియా జట్టు ఇక రెండో టెస్టులో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం పట్టు బిగించింది అని చెప్పాలి. ఏకంగా ఆస్ట్రేలియా స్పిన్నర్ లియోన్ 5 వికెట్లతో చెలరేగడంతో భారత బ్యాటింగ్ విభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రాహుల్ 17, పూజార 0, శ్రేయస్ అయ్యర్ 4పూర్తిగా విఫలం అవ్వగా.. రోహిత్ శర్మ 32, విరాట్ కోహ్లీ 44, రవీంద్ర జడేజా 26 పరుగులతో పర్వాలేదు అనిపించిన వరుసగా వికెట్లు కోల్పోయారు. 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా జట్టు.
ఇలాంటి సమయంలో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు కాకపోయినప్పటికీ ఇద్దరు స్పిన్నర్లు భారత జట్టును ఆదుకున్నారు అని చెప్పాలి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ మెరుపులు మెరిపించే అశ్విన్ మరోసారి 37 పరుగులు చేసి క్రీజులో నిలదొక్కుకున్నాడు. ఇంకోవైపు అక్షర్ పటేల్ 74 పరుగులతో రాణించాడు. మొదట ఎంతో నెమ్మదిగా ఆడిన వీరు తర్వాత వేగంగా షాట్స్ ఆడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎనిమిదవ వికెట్ కి 114 పరుగుల భాగస్వామ్యం జోడించారు. భారత్ 262 పరుగులకు ఆల్ అవుట్ అయింది. వీరి బ్యాటింగ్ చూసిన తర్వాత ఈ ఇద్దరు బ్యాట్స్మెంటు లేకపోతే టీమిండియాకు ఎలాంటి పరిస్థితి వచ్చేదో అని ఎంతోమంది క్రికెట్ ప్రియులు కామెంట్ చేస్తున్నారు.