
ఈ క్రమంలోనే కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయ్ అని చెప్పాలి. గత ఏడాది టి20 వరల్డ్ కప్ లో మేల్ బోర్న్ వేదికగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే భారత్,పాకిస్తాన్ మధ్య అసలు క్రికెట్ సంబంధాలు మళ్ళీ మొదలవుతాయా లేదా అన్నది మాత్రం అనుమానం గానే ఉంది. ఇక ఇటీవల ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్, భారత దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరిగేలా చూడాలి అంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేశాడు.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ చాలా బలమైన బోర్డుగా ఉంది. అయితే బిసిసిఐ తమను శత్రువులుగా చూడటానికి ప్రయత్నించవద్దు అంటూ షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. దానికి బదులుగా స్నేహితులుగా మారే విధంగా బీసీసీఐ కృషి చేయాలి అంటూ కోరాడు. మనం ఎవరితోనైనా స్నేహం చేయాలనుకున్న.. అతను మనతో మాట్లాడకపోతే మనం ఏం చేయగలం. అయితే బీసీసీఐ బోర్డు బలంగా ఉంది కాబట్టి మీకు మరింత బాధ్యత ఉంటుంది. మీరు ఎక్కువ మంది శత్రువులను తయారు చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. ఎక్కువమందిని స్నేహితులుగా చేసుకోవాలి. తద్వారా ఇంకా బలంగా తయారవుతారు అంటూ షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యానించాడు.