
వెరసి గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిన టీమ్ ఇండియా జట్టు చివరికి సిరీస్ కూడా కోల్పోయింది అని చెప్పాలి. గత కొన్నేళ్ల నుంచి కూడా స్వదేశంలో వరుసగా సిరీస్లను గెలుస్తూ వచ్చిన టీమిండియా జైత్రయాత్రకు ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది అని చెప్పాలి. అయితే ఇక ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. గిల్ 37, రోహిత్ 30, మంచి ఆరంభాలు అందించగా, కోహ్లీ 54, పాండ్యా 40 తమ బాధ్యత నిర్వహించారు. అయితే రాహుల్ 50 బంతుల్లో 32 పరుగులు చేసి పరవాలేదు అనిపించిన.. ఇక సూర్యకుమార్ డక్ అవుట్ కావడం.. రవీంద్ర జడేజా ఎక్కువ బాల్స్ వృధా చేయడంతో ఇక మ్యాచ్లో టీమిండియా ఓటమి దిశగా సాగింది.
అంతేకాదు భారత బ్యాట్స్మెన్లలో మ్యాచ్ గెలిపించాలనే కలిసి కూడా ఎక్కడ కనిపించలేదు అని చెప్పాలి. వెరసి 49.1 ఓవర్లలో 248 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది టీమ్ ఇండియా. దీంతో ఇక 21 పరుగుల తేడాతో అటు ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఇక 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది అని చెప్పాలి. దీంతో ఇక భారత జట్టు ప్రదర్శన పై విమర్శలు గుప్పిస్తున్నారు అభిమానులు.