
ఈ క్రమంలోనే గత ఏడాది మొదటి ప్రయత్నంలోనే ఐపిఎల్ టైటిల్ విన్నర్ గా నిలిచిన గుజరాత్ జట్టుకు హార్దిక్ తర్వాత కెప్టెన్ అయ్యేది ఎవరు అన్న విషయంపై ఇటీవలే ఆ జట్టు డైరెక్టర్ విక్రమ్ సోలంకి స్పందించాడు. ఫ్యూచర్ కెప్టెన్ ఎవరో కాదు శుభమన్ గిల్ అంటూ తెలిపాడు. క్రికెట్ నైపుణ్యం అద్భుతం అని అతను గుజరాత్ బావి కెప్టెన్ అంటూ చెప్పుకొచ్చాడు. హార్దిక్ తన కెప్టెన్సీ తో జట్టును ఎంతో అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడూ. అయితే అతని తర్వాత అతని వారసుడు ఎవరు అనే ప్రశ్నకు టీం డైరెక్టర్ విక్రమ్ సోలంకి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.
యంగ్ స్టర్ శుభమన్ గిల్ కు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆట గురించి చాలా తెలివిగా ఆలోచిస్తాడు అంటూ అభిప్రాయపడ్డాడు. అంతే కాదు ఎంతో బాధ్యత తీసుకొని ఇక ఆడుతూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే గత ఏడాది గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించడంలో కీలక పాత్ర వహించాడు గిల్. ఓపనర్ గా వచ్చి 16 మ్యాచ్ లలో 483 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు అని చెప్పాలి. కాగా గత ఏడాది మొదటి ప్రయత్నంలోనే టైటిల్ గెలిచిన గుజరాత్ ప్రదర్శన ఇప్పుడు ఎలా ఉంటుంది అనేదానిపై కూడా ఆసక్తి నెలకొంది అని చెప్పాలి.