ఇక ఎంతో అద్భుతమైన ప్లేయర్లతో అటు ఎప్పుడు ప్రత్యర్థులను వణికిస్తూ ఉంటుంది ముంబై ఇండియన్స్. కానీ ఇప్పుడు మాత్రం ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తుంది. అంతేకాదు గత ఏడాది నుంచి కూడా ఒక తెలుగోడి ఆట మీదే అటు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆధారపడుతూ వస్తుంది అని చెప్పాలి. ఆ తెలుగోడు ఎవరో కాదు హైదరాబాదుకు క్రికెటర్ తిలక్ వర్మ. తిలక్ వర్మను కొనుగోలు చేసిన తర్వాత అతనికి భారీ ధర పెట్టిందేమో అని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ అతని ఆట తీరు చూసిన తర్వాత అతనికి పెట్టిన ధర తక్కువనేమో అని అందరూ అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే ముంబై ఇండియన్స్ గత ఏడాది పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గర నుంచి జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్ల వరకు ఎవ్వరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇలా అందరూ చేతులెత్తేస్తున్న సమయంలో అప్పుడే ఐపీఎల్లో అడుగుపెట్టిన తిలక్ వర్మ మాత్రం ఎంతో అనుభవం ఉన్న క్రికెటర్ లాగా ప్రతి మ్యాచ్ లో కూడా జట్టు పరువును నిలబెట్టే ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. అతడి నిలకడైన ఫామ్ చూసి అటు మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపించారు.
అయితే వెంటనే అతనికి ఇండియాలో చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయితే ఇక ఇప్పుడు 2023 ఐపీఎల్ లో కూడా అదే ఫామ్ ని కొనసాగిస్తున్నాడు తిలక్ వర్మ. ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో మిగతా అందరూ బ్యాట్స్మెన్లు విఫలమవుతున్న వేళ అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం ఉన్న బౌలర్లను సైతం అద్భుతంగా ఎదుర్కొని భారీగా పరుగులు చేశాడు. 46 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అతని వల్లే ముంబై ఇండియన్స్ 171 పరుగులకు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది అని చెప్పాలి. కానీ చివరికి ఓటమి తప్పలేదు. అయినప్పటికీ ముంబై ఇండియన్స్ మరోసారి తెలుగు క్రికెటర్ ఆట మీదే ఆధారపడుతుందన్నది మాత్రం నిరూపితం అయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి