మహిళా క్రికెట్లో లెజెండ్ గా ఎదిగిన మిథాలీ రాజ్ భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఇక టీమిండియా ఉమెన్స్ టీం సారధ్య బాధ్యతలను భుజాన వేసుకుంది హార్మన్ ప్రీత్ కౌర్. ఇక తనదైన కెప్టెన్సీ తో జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదు బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేసి చూపించింది. ఏకంగా మొదటి ప్రయత్నంలోనే.ముంబై ఇండియన్స్ జట్టుకు టైటిల్ అందించింది అని చెప్పాలి.


 ఇలా ఒక క్రికెటర్ గా మాత్రమే కాకుండా అటు కెప్టెన్ గా కూడా ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది హార్మన్ ప్రీత్ కౌర్. కాగా ఇప్పటివరకు హర్మన్ ప్రీత్ తన కెరియర్ లో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించింది అన్న విషయం తెలిసిందే.  ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇక ఇప్పుడు భారత మహిళా క్రికెట్ హిస్టరీలో ఎవరికి సాధ్యం కాని ఒక అరుదైన అవార్డును దక్కించుకుంది హార్మన్ ప్రీత్ కౌర్.



 ఏకంగా విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు హర్మాన్ ప్రీత్ కౌర్ కు దక్కింది అని చెప్పాలి. అయితే ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ అరదైన రికార్డును సృష్టించింది అని చెప్పాలి. అత్యుత్తమ ప్రదర్శన చేసిన ప్లేయర్లకు ఈ అవార్డును ఇంగ్లాండులో అందజేస్తూ ఉంటారు. ఇకపోతే ఇంగ్లాండ్లో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా 141 పరుగులు చేసి అదరగొట్టింది హర్మాన్ ప్రీత్ కౌర్. ఇలా అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకుగాను బ్యాటింగ్ విభాగంలో హర్మన్  ప్రీత్ కౌర్ ఈ అరుదైన అవార్డును దక్కించుకుంది అని చెప్పాలి. దీంతో ఫాన్స్ అందరు కూడా సంతోషంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: