టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని తన కెప్టెన్సీ తో భారత క్రికెట్ లోనే కాదు అటు ప్రపంచ క్రికెట్లో సైతం ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ధోనిని మిస్టర్ కూల్ కెప్టెన్ అంటూ పిలుస్తూ ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. అయితే కేవలం కెప్టెన్ గా మాత్రమే కాదు ఒక ఆటగాడిగా, అదిరిపోయే ఫినిషిర్ గా.. అద్భుతము వికెట్ కీపర్ గా కూడా మహేంద్ర సింగ్ ధోని ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.



 ఇక ఇప్పుడు 41 ఏళ్ల వయసులో కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ మహేంద్ర సింగ్ ధోని ఇంకా యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల మహేంద్రసింగ్ ధోని ఒక అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ మెన్స్ టీ20 క్రికెట్ లో అత్యధిక క్యాచ్లు పట్టిన వికెట్ కీపర్ గా ధోని నిలిచాడు అని చెప్పాలి. ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మార్కరమ్ ఇచ్చిన క్యాచ్ ని అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు ధోని. ఈ క్రమంలోనే మార్కరమ్ క్యాచ్ మహేంద్రసింగ్ ధోనీకి 208వ క్యాచ్ కావడం గమనార్హం. దీంతో ఎక్కువ క్యాచ్లు పట్టిన ప్లేయర్ గా సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ పేరిట ఉన్న 207 క్యాచ్ ల రికార్డును అధిగమించాడు.



 అంతేకాదు ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడుగా కూడా ధోని అరుదైన రికార్డును సృష్టించాడు. అయితే ఇలా పొట్టి ఫార్మాట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన జాబితాలో ధోని, డీకాక్ తర్వాత టీమిండియా వెటరన్  వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మూడో స్థానంలో ఉన్నాడు. దినేష్ కార్తీక్ ఇప్పుడు వరకు తన టి20 కెరియర్ లో 205 క్యాచ్ లు పట్టాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ 172 క్యాచ్ లతో నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో ధోని సాధించిన అరుదైన రికార్డు పై అటు అభిమానులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: