రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇటీవల రాజస్థాన్ రాయల్స్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది అన్న విషయం తెలిసిందే. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో అద్భుతంగా రానించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. గ్రీన్ జెర్సీపై ఇన్నాళ్లపాటు అభిమానుల్లో ఉన్న భావలను పటా పంచలు చేస్తూ విజయం సాధించింది. దీంతో గ్రీన్ జెర్సీ తమ బ్యాడ్ సెంటిమెంట్ అన్న విషయాన్ని నిజం కాదు అని నిరూపించింది బెంగళూరు జట్టు. అయితే రెగ్యులర్ కెప్టెన్ అయినా ఫాబ్ డూప్లెసెస్ పక్కటెముకల గాయం కారణంగా ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో గత రెండు మ్యాచ్ల నుంచి కూడా విరాట్ కోహ్లీ  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సారాధ్య బాధ్యతలను భుజాన వేసుకొని జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇలా బెంగళూరు జట్టును కోహ్లీ కెప్టెన్ గా ముందుకు నడిపిస్తున్న నేపద్యంలో.. ఈ మ్యాచ్లను చూసి ఎందుకొ అటు అభిమానులు కూడా మరింత ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక కోహ్లీ కెప్టెన్సీలో అటు జట్టు రెండు విజయాలు సాధించడంతో మరింత ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ బెంగళూరు జట్టుకు విజయం అందించిన నేపథ్యంలో ఫాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయ్. జట్టులోని సభ్యులందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. కానీ ఇలా జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీకి మాత్రం ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ఏకంగా విరాట్ కోహ్లీ 24 లక్షల రూపాయల జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు అయిన కారణంగా బెంగళూరు జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీకి రిఫరీ 24 లక్షల జరిమానా విధించారు. అంతేకాకుండా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ తో పాటు ఇతర ఆటగాళ్లు అందరికీ కూడా ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజు లో 25% కోత గా జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. కాగా రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో బెంగళూరు జట్టు విజయం సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: