
అయితే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం కేవలం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతూ తన ఆటతో అభిమానులను అలరిస్తూ ఉన్నాడు. దీంతో ఇక ధోని ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు ఎంతో మంది అభిమానులు భారీగా తరలి వస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ధోని మొదట టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిట్నెస్ విషయంలో ఎంతో ఖచ్చితత్వంతో ఉండే.. ధోని ఇలా టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన ఆటతీరుతో దేశంలో ఎంతో మంది యువకులకు ఆరాధ్యుడిగా మారిపోయాడు అంటూ మాజీ కోచ్ రవి శాస్త్రి వ్యాఖ్యలు ఇచ్చాడు. వికెట్ల వెనకాల తనదైన మార్క్ తో అనేక మందికి స్ఫూర్తిగా నిలిచాడు అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇతరులకు అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ధోని టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ధోని ఆడాలనుకుంటే 100 టెస్టులు ఆడి ఘనంగా వీడ్కోలు పలికేవాడు అంటూ రవి శాస్త్రి తెలిపాడు.